చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్బంగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా న్యాయ శాఖ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వాలు భావిస్తూంటాయని కానీ తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. .హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు.
హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని కేసీార్ అన్నారు. సుదీర్ఘకాలం హైదరాబాద్లో పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు.న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా న్యాయాధికారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మిస్తామనన్నారు. సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు.