చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకొంది టీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీ యూత్ ని పట్టేశాయి. ఈ స్ఫూర్తితోనే డీజే టిల్లు స్వ్కేర్ ని పట్టాలెక్కించారు. అయితే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. ఆ ఛాన్స్ మల్లిక్ రామ్ ని వరించింది. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అనుపమ పరమేశ్వరన్ కూడా తోడవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది.
అయితే… ఇప్పుడు సెట్లో దర్శకుడికీ, హీరోకీ చిన్న చిన్న క్లాషెష్ మొదలైనట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. సిద్దు జొన్నలగడ్డ స్వతహాగా రైటర్. టిల్లు సక్సెస్ లో నటుడిగానే కాదు, రచయితగానూ తన వాటా చాలా ఎక్కువే ఉంది. ఈ సీక్వెల్ కీ తనే రైటర్. హీరో, రైటర్ ఒక్కడే కావడంతో తన డామినేషన్ ఎక్కువ అవ్వడం సహజం. పైగా సిద్దు టైమ్ అలా నడుస్తోంది. అయితే ఈ డామినేషన్ దర్శకుడికి కాస్త ఇబ్బంది కలిగిస్తోందట. ఈ విషయంపైనే చిరుబురులు, అలకలు నడుస్తున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే.. సిద్దు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. తన ఐడియాలజీనే టిల్లూ సక్సెస్ సీక్రెట్. అందుకే దర్శకుడు కూడా అదే ఫాలో అవ్వాల్సివస్తోందట. అంతిమంగా రిజల్ట్ బాగుంటే చాలు కదా. ఈ అలకలూ, కోపాలూ.. సినిమా హిట్ కొట్టాక ఎవరికీ గుర్తుండవు. డీజే టిల్లు తీస్తున్నప్పుడు కూడా విమల్ కృష్ణ కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ సినిమా సక్సెస్ అయ్యాక.. తను హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకొన్నాడు. ఈసారీ అదే సీన్ రిపీట్ అయితే అంతకంటే కావల్సిందేముంది?