చంద్రబాబు అధికారంలో ఉన్నారన్నా… బాబు సీఎం కుర్చీలో ఉన్నారన్నా… అధికారుల్లో కాస్త అటెన్షన్ ఉంటుంది. సుపరిపాలనలో చంద్రబాబు కాంప్రమైజ్ కారు అనేది ఓపెన్ సీక్రెట్. అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. అందులో సొంత పార్టీ నేతలున్నా వార్నింగ్స్ ఆగవు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. కడప జిల్లా నుండి మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి భార్య ఓ పోలీస్ ఆఫీసర్ ను నిలదీస్తుంది. అక్కడే ఉన్న పోలీస్ అధికారి రావటం ఎందుకు లేట్ అయ్యింది, ఎస్కార్ట్ పెట్టరా… వెయిట్ చేయాలా అంటూ అధికారిపై ఫైర్ అయ్యింది. దీంతో మంత్రికే కాదు మంత్రి భార్యకు కూడా ఎస్కార్ట్ పెట్టాలా? ఇదెప్పటి నుండి అంటూ సెటైర్లు వినిపించాయి.
దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇలాంటివి సహించేది లేదని ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. ఎవరి హద్దులో వారు ఉండాలని, రూల్స్ అతిక్రమిస్తే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పట్టించుకోనని… మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దని సూచించినట్లు సమాచారం.