జగన్ ఐదేళ్ల పాలనతో ఏపీ ఇరవై ఐదు ఏళ్లు వెనక్కి పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాలకుడు, పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశామన్నారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.
కొంతమంది అవసరాలకు తప్పులు చేస్తారు.. మరికొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు. కానీ గత ఐదేళ్లలో ఉన్మాదంతో తప్పు చేశారని జగన్ పాలన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమయం అవుతాయి. నేరస్థుడే నాయకుడైతే ఎలా ఉంటుందో ఐదేళ్లలో చూశాం. ప్రభుత్వం విడుదల చేస్తోన్న ఏడు వైట్ పేపర్లను చూస్తే..ఏపీకి ఐదేళ్లలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందని వివరించారు.
మాధపాన నిషేధం అని వైసీపీ హామీ ఇచ్చింది. అది పేరుకు మాత్రమే పరిమితమైంది. మధ్యం ధరలు విపరీతంగా పెంచారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. మద్యం ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే..ధరలు తగ్గిస్తే తాగేవారు తగ్గుతారని చెప్పారు. మొత్తంగా 75శాతం ధరలు పెంచారని అన్నారు. ప్రజలకు ఓ హామీ ఇచ్చామంటే అమలు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అందుకు విరుద్దంగా వ్యవహరించారు. తెలంగాణ, తమిళనాడు, ఓడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని మండిపడ్డారు.
Also Read : పవిత్ర భావం, పవిత్ర లక్ష్యంతో అమరావతి నిర్మాణం – రాజధానిపై చంద్రబాబు శ్వేతపత్రం
మద్యం వినియోగం పెరగడంతో పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగితే.. ఏపీలో మాత్రం తగ్గిందన్నారు. ఆ ఆదాయమంతా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ధరలు పెంచి పేదలకు మద్యం అందుబాటులో లేకుండా చేశారని.. దీంతో మరికొంతమంది మద్యంకు బానిసయ్యారని తెలిపారు. దేశంలో దొరికే మద్యం ఏపీలో దొరకకుండా చేశారని.. పెద్ద , పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. చెల్లింపులు ఆలస్యం చేయడం.. ఆర్డర్ ఇవ్వకుండా వేధించారన్నారు. ఇష్టం లేని బ్రాండ్ లన్నీ షాపుల్లో ఉంచేశారు.. వాళ్ళు ఏ కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
పేదవాడు శారీరకంగా అలిసిపోయి బాధలు మరిచిపోయేందుకు తాగుతాడు.. ఆ బలహీనతను గత ప్రభుత్వం క్యాష్ చేసుకుందన్నారు. పేదవాడికి అమ్మే లిక్కర్ పై విపరీతంగా ధరలు పెంచారన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచారని వివరించారు చంద్రబాబు..
మద్యం కుంభకోణంపై పూర్తి వివరాలు కింది లింక్ లో