షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ కానున్నారు. గురువారం హైదరాబాద్ రానున్న జగన్.. బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. బాత్ రూంలో జారిపడి గాయపడటంతో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్‌ను జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ మెల్లగా వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్నారు.
ఇంకా పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాల సమయం పట్టే చాన్స్ ఉంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అందరూ పరామర్శించినా జగన్ పరామర్శించలేదు. కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. ఈ భేటీలో పరామర్శ కన్నా..త రాజకీయమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు, టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరనుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్‌ను జగన్ కలవనుండటం ఇంట్రెస్టింగ్గా మారింది. కేసీఆర్‌ను తన రాజకీయ గురువుగా జగన్ భావిస్తారు. జగన్‌ను తన తమ్ముడిగా కేసీఆర్ భావిస్తారు. కేటీఆర్, జగన్ కూడా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కేటీఆర్ బాహాటంగానే చెప్పారు.
జగన్, తాను మంచి మిత్రులమని, కలిసినప్పుడు ఇద్దరం స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటామని కేటీఆర్ చెప్పారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, రాష్ట్రాల పరంగా ఉంటాయన్నారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్‌తో సంబంధం లేనట్లుగానే వైసీపీ వ్యవహరించింది. ఇప్పుడు కేసీఆర్ తో కలిసే రాజకీయాలు చేయాలని డిసైడయ్యారేమో కానీ.. జగన్ రాజకీయ పరామర్శకు బయలుదేరారు.