బొగ్గు గనుల వేలం చుట్టూ ఇప్పుడు తెలంగాణ రకాజకీయం నడుస్తోంది. సింగరేణికి ఏదో అయిపోతోందని చెప్పడం ద్వారా బీజేపీ , కాంగ్రెస్ లపై ఎటాక్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కానీ అసలు సింగరేణిని ముంచేసే ప్లాన్ చేసింది బీఆర్ఎస్సేనని రెండు పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయి.
తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. అందుకే బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హయాంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడానికి అంగీకరించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. బీఆర్ఎస్ వాదన ప్రకారం వేలంలో పాల్గొనకపోతే సింగరేణికి గనులు ఉండవు.. కేంద్రం కేటాయించదు. అప్పుడు సింగరేణికే నష్టం.
అదే కాంగ్రెస్ అంటోంది. వేలంలో పాల్గొనకుండా సింగరేణికి నష్టం చేశారని కాంగ్రెస్ అంటోంది. కోల్ బ్లాకులు బీఆర్ఎస్ నేతల సన్నిహితులుక చెందడానికే ఇలా చేశారంటున్నారు. సింగరేణికి ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులు మరో పదేళ్లలో అయిపోతాయని ఆ తర్వాత పరిస్థితేమిటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వేలంలో అయినా బొగ్గు గనులు దక్కించుకోవాలని.. తర్వాత కేంద్రంపై పోరాడి .. దొరికిన గనులు కేటాయింప చేసుకోవాలని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఆర్ఎస్ వల్లే సింగరేణికి పెను ముప్పు ఏర్పడిందని అంటోంది.
రోజూ ఈ అంశాలపై మూడు పార్టీల నేతలు వాదించుకుంటున్నారు. ప్రజలు ఎవరి వాదన నమ్ముతారో మరి !