వైసీపీ నేతల బాగోతాలు రోజులు గడుస్తున్న కొద్దీ బయటకు వస్తున్నాయి. వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుందోనని ఇన్నాళ్లు ఎక్కడో ఓ చోట భయం ఉండేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ బాధితులు మెల్లగా కదులుతుండటంతో.. ఫిర్యాదు చేయాలా వద్దా అని మీమాంసలో ఉండిపోయిన వారూ ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగోతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటిని స్వీకరించేందుకు అధికారులు కూడా గంటల కొద్ది ఆగాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగోతాలపై విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో మాజీ మంత్రి విడదల రజినిపై కూడా ఫిర్యాదు అందింది.
వైసీపీ హయాంలో విడదల రజిని తన మరిది పేరిట భూములను కొన్నారని, 25 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉన్నా… రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆమెపై టీడీపీ నేతలకు పల్నాడు జిల్లాకు చెందిన కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సొమ్ము ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయాడు.
అయితే, ఆయన ఇంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడా లేదా అన్నది పక్కన పెడితే, టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశాడంటే…రజిని విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తారనే టీడీపీ కార్యాలయంకు వచ్చి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.