హైదరాబాద్: అనంతపురంజిల్లా ఉరవకొండలో కోదండరామిరెడ్డి అనే రైతు నిన్న సిండికేట్ బ్యాంక్ అధికారుల వ్యవహారశైలితో విసుగుచెంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను అనుకూలంగా మలుచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఆత్మహత్యకు చంద్రబాబు సర్కారే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు రైతులను పూర్తిగా ముంచేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దళిత ఎంపీని సంజాయిషీ అడిగిన బాబు ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని రఘువీరా ప్రశ్నించారు.