పల్నాడులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా నిర్వహించిన ప్రజాగళం సభ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. సభను ఆటంక పరిచేలా వ్యవహరించేందుకు .. కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం లేకుండా అలా వదిలేశారు. లేనిపోని రూల్స్ పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ప్రజలు సౌండ్ టవర్లు ఎక్కుతున్నా ఆపలేదు. చివరికి సౌండ్ సమస్యలు రావడానికి కూడా.. కారణమయ్యారు. భద్రతా ఏర్పాట్ల విషయంలోనూ అలాంటి కుట్రలే చేశారు. దీనిపై ప్రధాని భద్రతా సిబ్బంది ఓ నివేదికను ఈసీకి పంపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైసీపీ కార్యకర్త కన్నా ఘోరంగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయన హయాంలో పల్నాడులో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. దాడులు, హత్యలు, దౌర్జన్యాలు చేశారు. కనీస ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు ఎవరిపై కేసులు పెట్టాలంటే వారిపై అడ్డగోలుగా కేసులు పెడుతూ పోయారు. చివరికి వైసీపీ నేతలకు తప్ప ఎవరికీ స్వేచ్చ లేనంత దుర్భర పరిస్థితి. ఎన్నికల కోడ్ వచ్చినా తన రూటు మారదని ఆయన నిరూపించారు.
ఈసీకి ఫిర్యాదులు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఏపీలో ఉన్న అధికారులు.. ఎన్నికల నిర్వహణ సిబ్బందిలో అత్యంత కీలకంగా ఉన్న వారిలో ఒకే సామాజికవర్గం వారు ఎక్కువ. వీరంతా ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగానే విధుల్లోపై స్థాయికి చేరారు. వీరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం అంటే.. ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లే.