తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా వ్యతిరేకత అనే పెట్రోల్‌తో మండించారు కేసీఆర్. అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రులకే పెద్ద పీట వేస్తున్నారు. తన టీ న్యూస్ చానల్‌కు సీఈవోగా ఆంధ్రా వ్యక్తిని నియమించారు. అంతే కాదు.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని కూడా ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. ఆయన ఆ నిర్మాణాన్ని ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు. అంచనాలు పెంచుకుంటున్నారు. కానీ నిర్మాణం మాత్రం సగం కూడా పూర్తి కాలేదు. ఈ అంశాన్ని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుకుని రాజకీయం ప్రారంభించారు.
లుంబిని పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించేందుకు 2017లో రూ. 80 కోట్లు కేటాయించారు. రెండు సార్లు టెండర్లు వాయిదా వేసి కేపీసీ అనే కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీ పూర్తి పేరు కామిషెట్టి పుల్లయ్య కంపెనీ. ఇది కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వాళ్లది. ఈ కంపెనీ నిర్మాణం ప్రారంభించింది కానీ పూర్తి చేయలేు. రూ. 63కోట్లతో ప్రారంభించి ఇప్పటికి మరో రూ. 127 కోట్ల అంచనా వ్యయం పెంచేశారు. అయినా పూర్తి కాలేదు. అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ేస్తున్నారు.
కేసిఆర్ తెలంగాణ బిడ్డో కాదో తేల్చడానికి డీఎన్ఏ టెస్టు చేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల స్థూపంలోనూ అవినీతికి కేటీఆర్, అతని మిత్రుడు తేలుకుంట శ్రీధరే కారణమని రేవంత్ ఆంటున్నారు. మొత్తంగా అమరవీరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లు నిర్మించడం కాస్త సెంటిమెంట్‌గా మారే అవకాశం ఉంది. ఇంకా నిర్మించకపోవడం అంచనాలు పెంచడం వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది.