అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం చెబుతూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అవే మార్గదర్శకాలను తాము అమలు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం.. నిన్నటి వరకూ అధికారులు ఇక చెక్‌పోస్టులు ఉండవన్న అభిప్రాయాన్ని మీడియా ప్రతినిధులకూ అంతర్గతంగా చెబుతూ వచ్చారు. ఈ విషయంపై మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా… చెక్‌పోస్టులు ఎత్తివేసిందని ఇక.. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునేవారికి ఇబ్బందులు లేవని చెప్పుకున్నారు. కానీ.. ఇలాంటి సంతోషం… ఎక్కువసేపు ఉండనీయలేదు అధికారులు. వెంటనే… మిగతా సడలింపులు ఓకే కానీ.. హైదరాబాద్ నుంచి రావాలంటే మాత్రం.. అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ప్రకటన చేసింది.
మాల్స్, టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. సాధారణ రోజువారీ జీవితం ప్రారంభమవుతోంది. అన్ని వైపుల నుంచి వివిధ రకాల పలుకుబడులతో..ఏపీలోకి వెళ్లేవాళ్లు వెళ్తున్నారు.. వచ్చే వాళ్లు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది సామాన్యులు.. అదీ ఏ పలుకుబడి లేని వాళ్లు మాత్రమే.. ఈపాస్ తీసుకుంటున్నారు. ఆ ఈ పాస్ తీసుకోవడంతో.. క్వారంటైన్‌కు తరలిస్తారేమోనన్న ఉద్దేశంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఏపీ అధికారులు ఈ విషయంలోనూ… స్పష్టత ఇవ్వడం లేదు. కేసులు అధికాకంగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తేనే.. క్వారంటైన్‌కు తరలిస్తామని చెబుతున్నారు. మిగిలినవారు హోం క్వారంటైన్ అంటున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పోస్టులు ఎత్తివేసింది. కానీ ఏపీ మాత్రమే గట్టిగా చెక్‌పోస్టులు ఉండాల్సిందేనని తీర్మానించుకుంది. ఈ రోజు నుంచి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దుల్ని ఓపెన్ చేశాయి. సరుకు రవాణా మాత్రమే కాదు.. ప్రయాణికుల వాహనాల్ని అనుమతిస్తున్నాయి. చివరికి కేసుల విస్ఫోటం ఉన్న దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్ని కూడా తెరుస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా.. రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. కానీ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలకు మాత్రం మూడు నెలల నుంచి కొనసాగుతున్న నరకం.. ఇక ముందు కూడా కొనసాగనుంది.