ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చి అక్కడ ఓ రకంగా చాలా ఉన్నతమైన స్థానాన్ని పొంది.. మంచి గౌరవం అందుకున్న రామ్ మాధవ్ ఇప్పుడు తిరిగి ఆరెస్సెస్‌కు వెళ్లిపోయారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు. బీజేపీలో అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. రాజ్యసభ, కేంద్రమంత్రి అంటూ జరిగిన ప్రచారాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆరెస్సెస్‌లోనే మళ్లీ ఏదో పదవి ఇచ్చారు. అయితే ఆయనను బయటకు పంపేయడానికి చాలా కారణాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే కొంత సమాచారం బీజేపీ ముఖ్య నేతల నుంచే బయటకు వస్తోంది.
జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్ ఇటీవల అవినీతి ఆరోపణుల చేశారు. తాను సంతకాలు పెడితే వందల కోట్లు ఇస్తానన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఎవరు చెప్పారు అంటే.. అప్పటి బీజేపీ ఇంచార్జ్. జమ్మూకశ్మీర్‌కు అప్పటి బీజేపీ ఇంచార్జ్ రామ్‌మాధవ్. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఆయన ఎక్కడ కనబడినా మీడియా అడుగుతోంది. అయితే ఆయన మాత్రం తనకేం తెలియదని.. సత్యపాల్ మాలిక్‌నే అడగాలని చెబుతున్నారు. ఓ తడబాటు ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈనాశ్య రాష్ట్రాల్లో బీజేపీ పతాకం ఎగరడం వెనుక ఆయన పాత్ర ఉంది. ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో ఓ స్వచ్చంద సంస్థ పెట్టి .. వాటికి సంబంధించిన వారిని ఆయా రాష్ట్రాల్లో సలహాదారులుగా పెట్టి.. సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్‌మాధవ్ దక్షిణాదిలోనూ రాజకీయాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.