పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇది సామూహిక అత్యాచారం కాదంటూ తాజాగా సీబీఐ సంబంధిత వర్గాలు పేర్కొనడటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ బెయిల్ పై విచారణ సందర్భంగా కోల్ కతా కోర్టు సీబీఐ తరఫు న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ ? తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ పై విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు ఆలస్యంగా వచ్చారు. విచారణ ప్రారంభమైన 50 నిమిషాల ఆలస్యంగా రావడంపై అడిషినల్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా ? ఈ అలసత్వం ఎందుకు? అంటూ సీరియస్ అయ్యారు.
అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..సంజయ్ ను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని.. బెయిల్ ఇవ్వొద్దని కోరారు.