విజయవాడలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా పాల్గొంటున్నా.. వైసీపీ నేతలు పాల్గొనకపోవడం పట్ల విమర్శలు రావడంతో ఆలస్యంగా కదిలారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలను పక్కనబెట్టి సహాయక చర్యలపై సలహాలు, సూచనలు చేయాల్సిన నేతలు..వరద రాజకీయం ప్రారంభించారు.
అధికారం కోల్పోయాక తీవ్రమైన ఫ్రస్టేషన్ లో ఉన్న జగన్..లాజిక్ లేకుండా మాట్లాడుతూ అదే లాజిక్ అంటూ విమర్శల పాలౌతున్నారు. విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణం చంద్రబాబు అంటూ ఆరోపించిన జగన్.. అందుకు చెప్పిన లాజిక్ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతోంది. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
విజయవాడకు ఓ వైపు బుడమేరు ఉండగా, మరో వైపు కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ రెండు వేర్వేరు మార్గాల్లో ప్రవహిస్తుంటాయి. రెండూ కలిసే అవకాశం లేదు. అయినా జగన్ మాత్రం ఆపత్కాల సమయంలోనూ తన మార్క్ రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు.
కృష్ణానదికి గరిష్టంగా 11.43లక్షల క్యూసెక్కులపైగా వరద వస్తోంది. బుడమేరుకు వస్తున్నది కేవలం 35వేల క్యూసెక్కులే. బుడమేరుకు వస్తోన్న వరదను నిలువరిస్తే కృష్ణానదికి వచ్చే వరద ఆగుతుందా? జగన్ లాజిక్ లేని ప్రసంగంతో సోషల్ మీడియాకు ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చేశారని అంటున్నారు.
కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేయకపోయినా కృష్ణానదికి వస్తోన్న రికార్డ్ స్థాయి వరదతో విజయవాడను జలదిగ్బంధం నుంచి రక్షించడం సాధ్యమయ్యే పనికాదని… అయినా జగన్ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా ఆరోపణలు చేయడంపట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఈమాత్రం తెలియకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపారు అంటూ ప్రశ్నిస్తున్నారు.