తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్.. బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు… బెదిరింపులు చూస్తే అలాంటి వారికి ప్రజాప్రతినిధి అయ్యే హక్కు ఉంటుందా అన్న అనుమానం రాక మానదు. వైసీపీ హయాంలో ఏపీ అసెంబ్లీలో మాత్రమే చూసిన లాంగ్వేజ్ ను ఆయన .. తెలంగాణ అసెంబ్లీకి తీసుకు వచ్చారు. అంతేనా తాను అన్నీ సాధారణ వాడుక భాషనే వాడానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
ఇక్కడ దానం నాగేందర్ భాష మాత్రమే కాదు… ఆయన వ్యక్తిత్వం కూడా బయటపడింది. ఇప్పుడు ఆయన అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ పార్టీ బీఫాం ఇస్తే గెలిచారు. ఇది రెండో సారి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ ఆయనకు రెండు సార్లు టిక్కెట్ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు కూడా ఆయన అఫీషియల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఆ పార్టీ నేతలపైనే బండ బూతులు అందుకున్నారు.
Also Read : డ్యామిట్…దానం బిగ్ మిస్టేక్.. అయినా!
రేపు రాజకీయం మారిపోతే మళ్లీ దానం నాగేందర్ ప్లేటు ఫిరాయిస్తాడు. అందలో సందేహమో లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది అధికారమే. పార్టీ మారిపోవడం వేరు.. అప్పటి వరకూ ఆదరించిన పార్టీపై.. పార్టీ నేతలపై అసభ్యంగా విరుచుకుపడటం వేరు. ఈ రెండు వ్యక్తిత్వానికి సంబంధించినవి. దానం లాంటి వాళ్లకు అలాంటివేమీ ఉండవు. దానంను ప్రోత్సహిస్తే రేపు కాంగ్రెస్ నేతలకు మరోసారి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనడంలో సందేహం ఉండదు.