బాహుబలి 2కీ, దంగల్కీ మధ్య వసూళ్ల పోటీ హోరా హోరీగా నడుస్తోంది. బాహుబలి 2 ని దాటుకొంటూ.. దంగల్ రికార్డు సృష్టించింది. బాహుబలి 2 రూ.1650 కోట్ల దగ్గిర ఆగితే, దాన్ని దాటేసి 2వేల కోట్ల రూపాయలతో ఇండియన్ నెం.1 బ్లాక్ బ్లస్టర్గా నిలిచింది దంగల్. అయితే.. బాహుబలి 2 సాధించిన ఓ మహత్త రికార్డ్ దరిదాపుల్లోకి కూడా… దంగల్ రాలేకపోయింది. బాహుబలి 2 .. ఏకంగా 1050 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇంకా ఆడుతూనే ఉంది. 50 రోజుల పోస్టర్లు కనుమరుగైపోతున్న ఈ దశలో ఓ సినిమా ఇన్ని కేంద్రాల్లో 50 రోజుల పండగ జరుపుకోవడం నిజంగా అపూర్వ ఘట్టమే. మరో సినిమాకి ఈ రికార్డ్ అసాధ్యం. ఆఖరికి దంగల్ కూడా కనీసం 600 కేంద్రాల్లో కూడా 50 రోజులు పూర్తి చేసుకోలేకపోయింది. భవిష్యత్తులో మరో సినిమా ఈ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందని ఆశించడం కూడా అత్యాసే! త్వరలోనే బాహుబలి 2 చైనాలో విడుదల కాబోతోంది. దంగల్ సాధించిన 2వేల కోట్ల వసూళ్లకు చెక్ పెట్టే అవకాశం బాహుబలికి ఇప్పుడు వచ్చింది. మరి.. ఆ రికార్డ్‌ని ఎన్ని రోజుల్లో బాహుబలి 2 తిరగరాస్తాడో చూడాలి.