బెంగళూరులో శశికళ సకల సౌకర్యాలు పౌందేవారని కవాలనుకుంటే.. షాపింగ్ కు కూడా బయటకు వెళ్లి వచ్చేవారని గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. వీడియోలు.. కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పుడు చేయాల్సిన హడావుడి చేశారు. ఇప్పుడు అభిమాని హత్య కేసులో జైల్లో ఉన్న దర్శన్ కూడా అలాంటి అవకాశాలే కల్పిస్తున్నారు. ఆయన హోటల్లో ఉన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం వీడియోలతో సహా బయటకు వచ్చింది.
దర్శన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. నిజానికి బీజేపీ పవర్ లో ఉన్నా.. బెంగళూరు జైళ్లలో అదే పరిస్థితి అని శశికళ ఉదంతం కూడా స్పష్టం చేసింది.అంతా డబ్బు మహిమ. ఈ ఇష్యూ వెలుగు చూసిన తర్వాత దర్శన్ ను మరో జైలుకు మార్చే ఆలోచనలో ఉన్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏ జైలులో ఉన్నా అదే పరిస్థితి కాక పోతే వైరే జైలులో అయితే వీడియోలు బయటకు రావేమో అంతే.
ఒక్క బెంగళూరులోనే కాదు అన్ని చోట్లా వీఐపీ నేరస్తులకు కోర్టులు ఇవ్వకపోయినా… స్టార్ హోటల్ స్థాయి సదుపాయాలు కల్పిస్తారన్న ఆరోపణల ఉన్నాయి. హైదరాబాద్ జైళ్లు అయినా దానికి మినహాయింపు కాదు. చంచల్ గూడలో .. వివేకా హత్య కేసు నిందితులు సకల సౌకర్యాలు అందుకున్నారని చెబుతారు. అయితే ఇక్కడ ఉన్న సిన్సియారిటీ ఏమిటంటే…ఫోటోలు వీడియోలు బయటకు రాకండా సకల జాగ్రత్తలు తీసుకుంటారన్నమాట.