విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టు డియర్ కామ్రేడ్. ఈ ప్రాజెక్టు ప్రారంభించింది విజయ్ దేవరకొండ బంధువు యష్ రంగినేని. ఆయన తన బిగ్ బెన్ బ్యానర్ మీద స్టార్ట్ చేసారు. తరువాత మైత్రీ మూవీస్ పార్టనర్ గా జాయిన్ అయింది. ప్రాజెక్టు బాధ్యత తన మీద వేసుకుంది.
అందుకే ఇప్పుడు మార్కెటింగ్ ను స్టార్ట్ చేసి, ఎవరి వాటా వాళ్లు తీసుకున్నారు. సీడెడ్, నైజాం యాష్ రంగినేని వాటాకు వచ్చింది. ఆంధ్ర మైత్రీ వాటాకు వచ్చింది. యాష్ రంగినేని తన సీడెడ్, నైజాం వాటాను 11 కోట్లకు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో కీలకమైన నైజాం ఏరియాను ఏషియన్ సునీల్ కు అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు.
ఇక ఆంధ్ర ఏరియాను 12 కోట్ల రేషియోలో మైత్రీ మూవీస్ మార్కెట్ చేసుకుంటోంది. ఇది కాక ఓవర్ సీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఏరియాలు వుండనే వున్నాయి. నాన్ థియేటర్ లాభాలు మామూలే. టొటల్ గా అన్ని కలిపి 40 కోట్లకు పైగా మార్కెట్ చేసినట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది.