విద్యార్థినులు ఓ అనుమానానికి గురయ్యారు. ఆందోళన చెందారు. బయట సోషల్ మీడియాలో దాన్ని రాజకీయం చేసుకున్నారు. వందల వీడియోలు బయటకు వచ్చాయన్నారు. ఇది ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులందరి భవిష్యత్ పై ప్రభావం చూపించే ఆరోపణ. ప్రభుత్వం చిన్న విషయంగా తీసుకోలేదు. జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని పిలిపించి అణువణువూ శోధిస్తోంది.
సాంకేతికంగా రికార్డు అయిన ప్రతి దృశ్యం వివరాలు వెలికితీత
కేంద్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుడ్లవల్లేరు కాలేజీ మొత్తం పరిశీలించారు. ఫోన్ టవర్ల దగ్గర నుంచి వెళ్లిన మెసెజులు… ఆ కాలేజీలో ఇంటర్నెట్ వాడిన ఫోన్ల కార్యకలాపాలు, ఎవరెవరు వీడియోలు రికార్డు చేశారు.. ఆ వీడియోలేమిటి అనే వివరాల్ని మొత్తం బయటకు తీశారు. సర్వర్ రూమ్ లో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించారు. మొత్తంగా ఆ కాలేజీ నుంచి ఫోన్ల ద్వారా జరిగిన ప్రతి వ్యవహారాన్ని విశ్లేషించారు.
విచారణకు ఢిల్లీ నుంచి మరో బృందం
వీడియోలు రికార్డు చేశారా లేదా అన్న విషయాన్ని నిగ్గు తేల్చడానికి మరో సాంకేతిక నిపుణుల బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. వారు కూడా మొత్తం బయటపడిన సమాచారాన్ని సీక్రెట్ కెమెరాలు పెట్టగలిగారా.. రికార్డు చేశారా అన్న అంశాలపై సాంకేతిక సమాచారాన్ని బయటకు తెస్తున్నారు.
సమాంతరంగా పోలీసుల విచారణ
మరో వైపు ఈ అంశంపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు సహా మొత్తం డిజిటల్ హిస్టరీని బయటకుతీసి విచారణ జరుపుతున్నారు. వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా కేవలం .. వీడియోలు.. ఈ వివాదానికి గురైన అంశాల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు.
విద్యార్థినుల భవిష్యత్ కోసమే
గుడ్లవల్లేరు కాలేజీలో వీడియో రికార్డింగ్ పై వచ్చిన ఆరోపణలు చిన్నవి కాదు. అవి వందల మంది విద్యార్థినుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే సీఎం చంద్రబాబు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని కూడా పిలిపించి పరిశీలన చేయిస్తున్నాయి. ఓ బాధ్యతాయుత ప్రభుత్వం ఎలా ఉండాలో అలా చేస్తున్నారు.
రాజకీయ కుట్ర ఉంటే కఠినమైన కేసులు
ఈ మొత్తం వ్యవహారంలో సైబర్ నిపుణుల నివేదిక తర్వాత… ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపైనా.. ఇలాంటి పుకార్లకు రావడానికి కారణం అయిన విద్యార్థులపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఎవరూ ఏ.. ఏ కాలేజీలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదని… విద్యార్థుల ప్రతి కదలికపై నిఘా ఉంటుందని తెలిసేలా చేసేలా అవకాశం ఉంది.