తీవ్రమైన జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. తీవ్రమైన దగ్గు కూడా ఉన్నప్పటికీ, వరద ప్రభావిత ప్రాంతాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా వరద తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరాపై పంచాయితీరాజ్ అధికారులతో భేటీ అయ్యారు.
వరద తగ్గిన ప్రాంతాల్లో వెంటనే సూపర్ క్లోరినేషన్ చేయటం… పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏమాత్రం అలసత్వం వహించినా ప్రజలంతా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఇప్పటికే వరదలతో ఇబ్బందిపడుతున్న ప్రజలు… ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడకుండా చూడాలని కోరారు. ఏలేరు రిజర్వాయర్ వరదపై అధికారులను ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. పవన్ తో పాటు కుటుంబ సభ్యులంతా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.