దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన దేవినేని అవినాష్ పై లుకౌట్ నోటీసులు ఉండటంతో …శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించి దొరకిపోయినట్లుగా అవుతుందన్న ఉద్దేశంతో తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం మీడియాకు ఆలస్యంగా తెలిసి బయట పెట్టింది. దీనికి ఎదురుదాడిగా అవినాష్ ఓ వీడియో విడుదల చేశారు.
పారిపోయేందుకు ప్రయత్నించలేదని.. పారిపోబోనని.. ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్పుకొచ్చారు. కానీ తాను ఎయిర్ పోర్టుకు వెళ్లానని..తనను ఫ్లైట్ ఎక్కనీయలేదని.. అనేది మాత్రం చెప్పలేదు. కనీసం ఎయిర్ పోర్టుకు వెళ్లానని కూడా అంగీకరించలేదు. అది నిజం కాకపోతే అసలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పోలేదని చెప్పుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండా.. తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుందని.. అదనీ ఇదనీ చెప్పుకొచ్చారు.
జగన్ రెడ్డి మాటలు విని.. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడికి కుట్ర చేసిన దేవినేని అవినాష్ ను వదిలి పెట్టాలని ఏ టీడీపీ నేతా అనుకోరు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన నేతకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో టీడీపీ ముందుగానే ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఉంటుంది. అది అనుభవించాల్సింది అవినాష్నే. టీడీపీలో ఉండే అవినాష్.. జగన్ రెడ్డి ఆకర్ష్ కు గురై వైసీపీలో చేరి.. ఇలాంటి తప్పుడు పనులు చేసి.. ఇప్పుడు విజయవాడలో ఉన్నా బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.