ధృవ్ రాతీ… సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోస్ ఓ సెక్షన్ కు అస్త్రంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక లీడర్ల ప్రసంగాల కంటే యూట్యూబ్ లో ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోస్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా? అనే టైటిల్ తో విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతోంది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించాడు. 29ఏళ్ల ధృవ్ డిజిటల్ స్పేస్లో సుపరిచితుడు. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు,మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
తాజాగా నియంత అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 1933లో, హిట్లర్ నాజీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి తన సొంత పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడని, అదే సమయంలో 1999లో, పుతిన్ తన సొంత దేశ పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమని ఆరోపించారు. ఇదంతా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నియంతలు చేసే దుశ్చర్యలు అంటూ చేసిన వీడియోను ట్వీట్ చేశాడు.
ఇండియాలోనూ అవే తరహ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నాడు. పుల్వామా అటాక్ కూడా బీజేపీ అధికారం కోసమేనని ఆరోపించాడు. హిట్లర్ , పుతిన్ తరహలో మోడీ కూడా అధికారం కోసం దుశ్చర్యలకు తెగబడుతున్నారని ఆరోపించారు.
Did you know that a Dictator can go to any extent to keep his power?
– In 1933, Hitler’s Nazi Party set fire to his own parliament building to change the constitution
– In 1999, Putin was allegedly responsible for bomb blasts on his own citizens⚠️This election, Beware of… pic.twitter.com/yoUA3x4ux0
— Dhruv Rathee (@dhruv_rathee) May 1, 2024