బీఆర్ఎస్ ఇన్ని కష్టాలకు.. కేసీఆర్ కుటుంబానికి మనశ్శాంతి లేకపోవడానికి కేసీఆర్ అహంకార పూరితంగా తీసుకున్న నిర్ణయాలే కారణమన్న అసంతృప్తి ఆ పార్టీలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత దుస్థితికి అసలు కారణం బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలన్న కేసీఆర్ దుస్సాహస నిర్ణయమే కారణమన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపిన విషయం వెలుగులోకి రావడంతో … ఆయనను టార్గెట్ చేయడం వల్లే బీజేపీ ఇదంతా చేసిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.
కాంగ్రెస్ గెలుపులో బీజేపీ పరోక్ష పాత్ర
తెలంగాణలో గ్రెస్ గెలుపునకు కారణాలు ఏవరేం చెప్పినా అసలు కారణం మాత్రం బీజేపీనే. జోరు మీదున్న బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ రేసు నుంచి వెనుకబడిపోయింది. కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. బీజేపీ ముందే కాడి పడేయడానికి కారణం .. కాంగ్రెస్ గెల్చినా పర్వాలేదు… బీఆర్ఎస్ గెలవకూడదన్న క్లారిటీతోనేనని అంటున్నారు. బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలో బలంగా పోరాడి ఉన్నట్లయితే.. కనీసం హంగ్ అయినా వచ్చేదని లేకపోతే ఓట్లు చీలి కేసీఆర్ గెలిచేవరన్న వాదన ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసి తాము గెలవకపోయినా బీఆర్ఎస్ ను ఓడించింది.
దెబ్బ మీద దెబ్బ కొడుతున్న బీజేపీ
అదను చూసి కవితను జైలుకు పంపారు. కవితకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ కుమార్తెపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం.. ఢిల్లీ జైలులో ఉండటాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గొప్పగా ఫలితాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ద్వారానే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేయాల్సినదంతా చేస్తోంది. తనను టార్గెట్ చేశారని తెలిసిన తరవాత హైదరాబాద్ వచ్చిన బీఎల్ సంతోష్… ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని కేసీఆర్ ను హెచ్చరించారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారని బీజేపీ వర్గాలంటున్నాయి.
బీఎల్ సంతోష్ జోలికెళ్తే ఊరుకుంటారా ?
ఢిల్లీ బీజేపీలో మోదీ, అమిత్ షా తర్వాత అధ్యక్షుడిగా నడ్డా ఉన్నా సరే.. బీఎల్ సంతోషే వపర్ ఫుల్. తమ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కేసీఆర్ కు ప్రత్యక్షంగా అందరూ చూపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ అసలు వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీఎల్ సంతోష్ జోలికి వెళ్లాలనుకోవడమే… అహంకార పూరిత నిర్ణయమని అదే కేసీఆర్ పతనాన్ని శాసిస్తోదని బీజేపీ నేతలు నేరుగానే చెబుతున్నారహు.