సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయనేం అడిగారన్న విషయం పక్కన పెడితే… ఈ లేఖ వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే లేదని..భయం భయంగా ఆ లేఖలోనే చెప్పడం హైలెట్ అవుతోంది. జగన్ అంటే ముద్రగడ పద్మనాభం ఇంత భయపడుతున్నారేంటి అని ఆ లేఖ చూసిన వారందిరికీ అనుమానం వస్తోంది. ఎందుకంటే ముద్రగడ లేఖలో అడిగింది.. జగన్ లాగేసుకున్నదే. దాని కోసమే ముద్రగడ రైళ్లు తగులబెట్టేంత ఉద్యమాలు చేశారు. ఆ లాగేసుకున్నదాన్ని ఇవ్వమని అడగడానికి భయం..భయంగా .. ఇబ్బంది పడొద్దని చెబుతూ లేఖ రాయడం.. ముద్రగడ ఉన్న దీనస్థితి కి అద్దం పడుతోందన్న అబిప్రాయం వ్యక్తముతోంది.
ఇటీవల పార్లమెంట్లో 2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా, పది శాతం ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందని కేంద్రం ప్రకటిచింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం సహా అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ఇక సర్టిఫికెట్ల జారీనే అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు.. కేంద్రం కూడా చెల్లుతాయని చెప్పింది. అయినా ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్లు సాధ్యం కావని చెబుతోంది. దీంతో ముద్రగడ ఎందుకు ప్రశ్నించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
చివరికి ముద్రగడ జగన్ ను బతిమాలుతున్నట్లుగా ఓ లేఖ రాశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని సూచించారు. రు. తన ఈ లేఖ వల్ల జగన్ ఇబ్బంది పడతారని ముద్రగడ పద్మనాభం అనుకున్నారేమో కానీ చివరిలో వివరణ కూడా ఇచ్చారు.