ఈ రోజుల్లో… యాక్షన్ సీన్స్ లో కూడా క్రియేటివిటీ ఆశిస్తున్నారు జనాలు. రొడ్డ కొట్టుడు యాక్షన్ సీన్లకు కాలం చెల్లిపోయింది. ప్రతీ ఫైట్ లోనూ.. ఏదో ఓ థీమ్ ఉండాల్సిందే. ఫైట్ మాస్టర్లు ఈ థీమ్ ల విషయంలో… తలలు బద్దలు కొట్టుకొంటున్నారు. యాక్షన్ సీన్స్ ని స్టైలీష్‌గా డిజైన్ చేయడానికి కాన్సెప్టుల వెంట పడుతున్నారు. ఇప్పుడు పాటల్లో కూడా యాక్షన్ ని మేళవించడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి థీమ్స్, కాన్సెప్ట్స్లలో రామ్ – లక్ష్మణ్ మాస్టర్లు ముందుంటారు. వాళ్లు యాక్షన్ సీన్స్ డిజైన్ చేసే విధానం.. చాలా స్టైలీష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ సంక్రాంతికి రాబోతున్న… వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్లే యాక్షన్ కంపోజ్ చేశారు.
ఈ రెండు సినిమాల విషయంలో… రామ్ – లక్ష్మణ్ బాగా కష్టపడ్డార్ట. కొత్త థీమ్‌లను ప్రజెంట్ చేశార్ట. `వాల్తేరు వీరయ్య`లో ఇంట్రవెల్ ముందువచ్చే గన్ ఫైట్.. ‘వీర సింహారెడ్డి’లో బాలయ్య చేసే ఛైర్ ఫైట్… కొత్తగా ఉంటాయని, ఫ్యాన్స్‌ని అలరిస్తాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ”వీర సింహారెడ్డిలో బాలయ్య ఛైర్లో కూర్చుని ఓ ఫైట్ చేస్తారు.. ఫైట్ అంతా.. ఆయన ఛైర్లోనే ఉంటారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గన్ తో విజృంభిస్తారు. అప్పటి వరకూ లుంగీ కట్టుకొని పక్కా మాస్‌గా కనిపించిన చిరంజీవి ఒక్కసారిగా స్టైలీష్ లుక్‌లో మారిపోవడం ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేస్తుంది. ఈ రెండు ఫైట్లూ… థియేటర్లో విజిల్స్ వేయిస్తాయ” ని చెప్పుకొచ్చారు రామ్ లక్ష్మణ్. ‘వాల్తేరు వీరయ్య’లో శ్రుతిహాసన్ – చిరంజీవి మధ్య ఓ సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశార్ట. ఇది ఫుల్ కామెడీ యాంగిల్ లో సాగబోతోంది.