సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడే కాదు. మంచి బిజినెస్ మెన్ కూడా. ఆ వ్యాపారాలు, ఆ లెక్కలు అన్నీ సతీమణి నమ్రతవే అని టాక్ వుంది కానీ, తెరవెనుక వుండి ఆడించేది మహేష్ బాబే అని ఆయనతో సినిమాలు చేసిన చాలా మందికి తెలుసు.
మహర్షి అనే సినిమా ద్వారా, పివిపి కి చేయాల్సిన రెండు సినిమాలు (ఒకటి అగ్రిమెంట్, ఒకటి బ్రహ్మోత్సవం డిజాస్టర్ కు బదులు) అశ్వనీదత్ కు చేయాల్సిన ఒక సినిమా, దిల్ రాజు చేసే సినిమా మొత్తం నాలుగు సినిమాలు ఒక్క షాట్ తో కానిచ్చేసారు.
ఇప్పుడు అలాంటి ప్లాన్ నే మళ్లీ వేసారు. మహర్షి సినిమాలో పివిపి కి, అశ్వనీదత్ కు వాటాలు ఇచ్చినపుడు దిల్ రాజు కు మాట ఇచ్చారు. మరో సినిమా చేస్తాలే అని. ఇప్పుడు అనిల్ సుంకర-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో చేయబోయే సినిమాలో దిల్ రాజు ను దూర్చేసి, ఆ ఫార్మాలిటీ అయిపోయిందనిపించాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ విధంగా అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఓ ప్రాజెక్టు చేసేస్తే, ఇక ఫ్యూచర్ లో వేరేవాళ్లకి ప్రాజెక్టు చేసేయచ్చు. అయితే ఈ విషయం నిర్మాతలకు అర్థం కానిదా? అందుకే అనిల్ రావిపూడి-అనిల్ సుంకర ప్రాజెక్ట్ లో దూరడానికి దిల్ రాజు కాస్త విముఖతగా వున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగయిదు చిన్న ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నానని చెప్పి, ఈ ప్రాజెక్టును తప్పించుకునే ఆలోచనలో దిల్ రాజు వున్నారని టాక్.