తమిళంలో పెద్ద హిట్ అయిన క్లాస్ మూవీ 96 ను తెలుగులో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో పెద్ద హిట్ అయిన 96 ను తెలుగులో మాత్రం 1996 టైమ్ పీరియడ్ లో తీయడం లేదు. అలా తీస్తే, శర్వానంద్ ను మరీ ఏజ్డ్ గా చూపించాల్సి వస్తుంది. అందువల్ల 96 అన్న టైటిల్ సూట్ కాదు. అదీ కాక ఇలా నెంబర్లు టైటిల్ గా పెడితే సినిమాకు ఫ్యామిలీ, అండ్ ఆల్ రౌండ్ లుక్ వస్తుందా? అన్నది అనుమానం. అందుకే టైటిల్ డిఫరెంట్ గా వుండాలన్న వెదుకులాట ప్రారంభమైంది.
సరైన యాప్ట్ తెలుగు టైటిల్ కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. డైరక్టర్ ఎలాగు తమిళియన్ కాబట్టి, తెలుగు టైటిళ్ల విషయంలో నిర్మాత దిల్ రాజే తన సన్నిహిత డైరక్టర్లు, క్రియేటివ్ పీపుల్ తో కలిసి రకరకాల టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు బోగట్టా. సినిమా ఉగాదికి ప్రారంభమవుతుంది. ఆ నాటికి టైటిల్ ను రెడీ చేయాలని అనుకుంటున్నారు. అలా అయితే డే వన్ నుంచి టైటిల్ జనంలోకి వెళ్తుంది.
ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ చాలా అవసరం అందుకోసమే ప్రారంభించే రోజు నాటికే టైటిల్ ఫిక్స్ చే యాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.