మహర్షి సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పారంటూ మహేష్ అభిమానుల మధ్య కొన్ని మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతే కాదు, మహేష్ అభిమానులకు, మహేష్ వార్తలను ప్రచారం చేసే వెబ్ సైట్లలో కూడా దర్శనమిస్తున్నాయి. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారు? వాటి వైనం ఏమిటి?
”..మహర్షి సినిమా అయిపోయి బయటకు వచ్చేవారు బరువైన హృదయంతో వస్తారు. మహేష్ పర్సనల్ లైఫ్ తో స్టోరీ కనెక్ట్ అయి వుంటుంది. స్నేహంలో వుండే ఎమోషన్, అమ్మనాన్నలతో వుండే ఎమోషన్, సౌసైటీతో వుండే ఎమోషన్, అసలు మహర్షి ఎవరు? ఎవరైనా మహర్షి ఎందుకు అవుతారు?” ఇలా వుంటుంది సినిమా అన్నారట దిల్ రాజు.
దీన్ని బట్టి చూస్తుంటే చాలా బరువైన కథనే తలకెత్తకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలకు రేటింగ్ లు, ప్రశంసలు వస్తాయి కానీ, పైసలు రావడం కష్టం అని గతంలో రుజువైన అంశం. వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్. దానికి ప్రశంసలు మాత్రమే మిగిలాయి. పైగా మళ్లీ పల్లెటూరు, వ్యవసాయం, లాభసాటి లాంటి వ్యవహారాలు మహర్షి ద్వితీయార్థం అంతా పరుచకున్నాయి అని టాక్.
ఇవన్నీ తెలుసుకుని, దిల్ రాజు మాటలు తెలుసుకుంటే సినిమా ఎలా వుంటుందో అనే దానికన్నా, ఎలా ఫేర్ చేస్తుందో అని అభిమానులు కలవరపడుతున్నారు.