ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా టికెట్లను అమ్మే విధంగా తీసుకున్న నిర్ణయంపై దర్శకుడు దేవకట్టా స్పందించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ధైర్యంగా పెదవి విప్పారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని థియేటర్లు ఆ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు అమ్మవలసి వస్తుంది. బ్లాక్ మనీ ని నియంత్రించడం అనే ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ, సినిమా రంగం కంటే అత్యంత ఎక్కువ బ్లాక్ మనీ ఉన్న ఇతర వ్యాపారాలను రాజకీయ నాయకులను వదిలేసి కేవలం సినిమా రంగాన్ని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేయడం పరిశ్రమకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశంపై వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు దేవకట్టా స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి రైల్వేస్ వంటి వాటి విషయంలో ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్లు పెట్టి విక్రయించడం సమంజసమే అయినప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సినిమాల విషయంలో ప్రభుత్వం ఈ పద్ధతి అనుసరించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేటు కాంట్రాక్టర్ల మాదిరిగా సినీ నిర్మాతలు కూడా ప్రభుత్వం ముందు తమ డబ్బు కోసం తాము వేచి ఉండాల్సి వస్తుందేమో అని వ్యాఖ్యానించారు. సినీ నిర్మాతల డబ్బు విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం నిర్మాణ విషయంలో బడ్జెట్ కేటాయించి సహకరిస్తుందా మరి అని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సరిగా లేకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగులు సహా అనేక మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక పోవడం , పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక పోవడం వంటి అనేక సమస్యలు ఉండగా జగన్ ప్రభుత్వం సినిమా వాళ్ళ మీద ఎందుకు పడుతుంది అన్నది ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. బహుశా ఏదో వ్యక్తిగత అజెండాతో, సినిమా వాళ్ళు తనకు మోకరిల్లడం లేదన్న ఇగో తో జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.