తొలి చిత్రం అందాల రాక్షసితో…. ప్రేమకథల స్పెషలిస్టుగా మారిపోయాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచె మనసు చిత్రాల్లో లవ్ స్టోరీలు బాగానే ఉంటాయి. ఇప్పుడు `సీతారామం` తెరకెక్కించాడు. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ సినిమా తరవాత… రెండు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు హను. హిందీలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. అమేజాన్ ప్రైమ్ కోసం హను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. రెండూ డిఫరెంట్ కాన్సెప్ట్ కథలే అని తెలుస్తోంది. అంటే `సీతారామం` ఎంత పెద్ద హిట్టయినా, తెలుగులో హను ఓ సినిమా చేయడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.
”నాకు కొన్ని ఫ్లాపులు వచ్చాయి. అందుకే గ్యాప్ పెరిగింది. చిత్రసీమలో ఎంత టాలెంట్ ఉన్నా, హిట్టు ఫ్లాపుతోనే ఆ ప్రతిభను బేరీజు వేస్తుంటారు. దాన్ని తప్పుపట్టలేం. ‘సీతారామం’తో మళ్లీ ట్రాక్‌లోకి వస్తానన్న నమ్మకం ఉంద“న్నారు హను. వైజయంతీ మూవీస్ రూపొందించిన ‘సీతారామం’ ఆగస్టు 5న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించాడు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మిక ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.