రవితేజ – వీఐ ఆనంద్ కాంబినేషన్లో `డిస్కోరాజా` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తరవాత ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి కారణం.. హెవీ బడ్జెట్ అని గుసగుసలు వినిపించాయి. ఆనంద్ వేసుకున్న బడ్జెట్‌కీ, రవితేజ మార్కెట్ కీ సంబంధం లేకపోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందని, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారని చెప్పుకున్నారు.
అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం. ఈనెల 27న రెండో షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్‌ని తమ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఉందని, వాటి కోసం పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ చేద్దామనుకున్నామని, అందుకే చిత్రీకరణ ఆలస్యమయ్యిందని స్పష్టం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అంటున్నారు. ఈ కొత్త షెడ్యూల్లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేషా, సునీల్, రాంకీ తదితరులు పాల్గొనబోతున్నారు.