దర్శకుడు, కెమెరామెన్ సినిమాకి రెండు కళ్లు. దర్శకుడి విజన్ అర్థం చేసుకొని కెమెరామెన్ పనిచేయాల్సివుంటుంది. దర్శకుడు ఓ కల కంటే, ఆ కలని అందంగా తెరపై చూపించాల్సిన బాధ్యత కెమెరామెన్దే. అందుకే వాళ్లిద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే ఈమధ్య దర్శకుడికీ, కెమెరామెన్‌కీ మధ్య క్లాష్ రావడం, ఆ సినిమాని వదలిలేసి కెమెరామెన్ బయటకు వెళ్లిపోవడం జరుగుతున్నాయి. ఈమధ్య డీజేకి ఇలానే జరిగింది. ఈ సినిమా కోసం ఇద్దరు కెమెరామెన్లు మారారు. ఎన్టీఆర్ ‘లవకుశ’కీ ఇదే జరిగింది. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ‘ఎంసీఏ’కీ కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది.
నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎంసీఏ. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత. ‘కేశవ’ సినిమాకి అదిరిపోయే కలర్ ఇచ్చిన కెమెరామెన్ దివాకర్ మణిని ఈ సినిమా కోసం ఎంచుకొన్నారు. అయితే.. ఇప్పుడు దివాకర్ ఈ సినిమాని వదిలేసి వెళ్లిపోయాడు. దర్శకుడికీ, దివారకర్కీ సెట్లో ఒక్క క్షణం కూడా పడేది కాదట. ఇద్దరి మధ్య వ్యవహారం చెడడంతో… దివాకర్ ‘ఎంసిఏ’కి గుడ్ బై చెప్పేశారని, అతని స్థానంలో ఇప్పుడు మరో కెమెరామెన్‌ని తీసుకొన్నారని తెలుస్తోంది. మరి దివాకర్ స్థానంలో వచ్చిన ఆ కెమెరా మెన్ ఎవరో, ఎంతకాలం ఉంటాడో?? చూడాలి.