బెంగళూరులో తెలంగాణ కాంగ్రెస్ మినీ హైకమాండ్ కొలువుదీరింది. ఆ హైకమాండ్ డీకే శివకుమార్. అక్కడ్నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను డీకే శివకుమార్ తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. డీకే శివకుమార్ చార్జ్ తీసుకున్నారు. కేసీఆర్ ను ఓడించేది కాంగ్రెస్సే అన్న అభిప్రాయం తీసుకు రావడానికి .. బీఆర్ఎస్ ను ఓడించడానికి రెడీ అయ్యే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ సేవలను వినియోగించుకుంటోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ప్రారంభమైన చేరికల వెనుక డీకే శివకుమార్ మంత్రాంగం పని చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు..కాంగ్రెస్ అనుకూల ఓటు చీలకుండా కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని డీకే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బెంగళూరు నుంచే ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీలో చేరాలనుకున్న వారు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలుస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
డీకే శివకుమార్ రాజకీయాలను ఎలా చేయాలో ఆలా చేస్తారని చెబుతూంటారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా అసంతృప్తి స్వరాలు వినిపించడం లేదు. అందరూ ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారు. పదవులు అనే ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే వస్తుందని .. నేతలకు గుర్తు చేయడంలో.. డీకే శివకుమార్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.