అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో అప్పర్ హ్యాండ్ సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరడం లేదు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న హరీష్ రావు గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించినా..రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి. అధికార – విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నా కాంగ్రెస్ నేతల కౌంటర్లతో సభ ఆద్యంతం హస్తం పార్టీదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది.
అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఎక్కడా దొరుకుతారా..? అని వెయిట్ చేస్తోన్న బీఆర్ఎస్ కు మహిళ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది. కేటీఆర్.. వెనక ఉన్న మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు.. నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనడంతో అది తమనే అన్నారని సబితా శోకం పెట్టారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అయినా తమకు పంటి కింద రాయిలా మారిన రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారేమో కేటీఆర్ గురువారం ఆందోళనలకు పిలుపునిచ్చారు.
Also Read : బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా ఫెయిలవుతోందా?
తెలంగాణ లో మహిళలకు పెద్దపీట వేస్తారని..అలాంటిది మహిళా ఎమ్మెల్యేలను రేవంత్ అవమానించారని కేటీఆర్ మండిపడ్డారు. అనంతరం సభ వాయిదా పడటంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు. కానీ , సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్ కు లాభం ఉండదని అనుకొని…మహిళలను రేవంత్ అవమానించారని సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు. గురువారం నిరసనలకు పిలుపునిచ్చారు. అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయడం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.