కుట్రల స్ట్రాటజిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదు. ఏ చిన్నది జరిగినా ఆయన మీడియా ముందుకు వచ్చి అంతా టీడీపీనే చేసిందని చెప్పి పోతూంటారు. దేశవ్యాప్తంగా వైసీపీ ఇమేజ్ ను మరోసారి డ్యామేజ్ చేసిన ఈవీఎం ధ్వంసం ఘటనను సమర్థించుకోవడానికి ఆయన తెర ముందుకు రాలేదు. తనదైన వక్రభాష్యాలతో.. ఆ వీడియో ఫేక్ అనో.. రిగ్గింగ్ చేశారో చెప్పలేకపోయారు.
సజ్జల ఎక్కడ ఉన్నారో పార్టీ నేతలు కూడా చెప్పడం లేదు. ఆయన రిలాక్స్ కారని.. జగన్ రెడ్డి లేని సమయంలో ఇక్కడ అధికారుల్లో గ్రిప్ కోల్పోకుండా ఆయనే పనులు చక్కబెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేల కోట్ల బిల్లులు.. కేటాయింపులు.. ప్రభుత్వం మారితే స్కాంలు దొరకకుండా చేయాల్సిన పనుల గురించి ఆయన తీరిక లేకుండా ఉన్నారని అంటున్నారు. పూర్తిగా సీఎస్ ఆయన డైరక్షన్ లోనే రోజువారీ పనులు చేస్తున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి
ఈవీఎంల విషయంలో పిన్నెల్లిని సమర్థించేందుకు కాసు మహేష్ రెడ్డిని రంగంలోకి దించారు. అంబటి రాంబాబుతో ఆ వీడియో ఫేక్ అనిపించారు. కానీ వైసీపీ అధికారిక వాదన మాత్రం సజ్జల నోటి నుంచి రావాల్సి ఉంది. చేయించేది జగనే అయినా.. మొత్తం చక్కబెట్టి సకలశాఖా మంత్రిగా వ్యవహరించింది సజ్జల రామకృష్ణారెడ్డే, సీఐడీ దగ్గర నుంచి డీజీపీ వరకూ అందరూ ఆయన చెప్పిన పనులే చేసేవారు. చివరికి జిల్లా ఎస్పీలు ఏదైనా ప్రెస్ నోట్ ఇవ్వాలన్న సజ్జల ఆఫీసు నుంచే వెళ్లేది. అందుకే చాలా మంది ఐపీఎస్‌లపై వారు వైసీపీ సానుభూతిపరులన్న ముద్రపడింది. కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శించారు.. అది వేరే కేటగిరి. గురువారం కూడా సజ్జల బయటకు వచ్చి… ఈవీఎంల విషయంలో ఏమీ చెప్పకపోతే… ఆయన సీక్రెట్ మిషన్ గురించి అందరూ ఆరా తీయడం ఖాయమని అనుకోవచ్చు.