అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో ఆయన వెనుకబడిపోయినట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా సమర్థంగా పని చేశారు. ఆ పనితీరుతో పాటు ట్రంప్‌తో పోలిస్తే మెరుగైన వ్యక్తిత్వం ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
బుల్లెట్ దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు సానుభూతి వెల్లువలా వస్తుందని అనుకున్నారు. కానీ డెమెక్రాట్లు అక్కడే పక్కా ప్లాన్ తో … అభ్యర్థి మార్పుపై ముందడుగు వేశారు. బైడెన్ వెనుకబడిపోయారని.. అందుకే మారుస్తున్నారన్న ప్రచారం జరిగితే మొదటికే మోసం వస్తుంది. కానీ సరైన సమయం చూసి.. అలాంటి భావన లేకుండా మార్చేసుకున్నారు. బైడెన్ కూడా వ్యూహాత్మకంగా వైదొలిగారు. అమెరికాలో మొదటి మహిళా అధ్యక్షురాలు అన్న సెంటిమెంట్ క్రమంగా పెరుగుతోంది.
Also Read : బైడెన్ విరమణ – ట్రంప్‌తో కమలా హ్యారీస్ పోటీ ?
ప్రపంచవ్యాప్తంగా మహిళా నేతలు ప్రముఖ దేశాల్ని ఏలుతున్నారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో ఇంత వరకూ ఓ మహిళా ప్రెసిడెంట్ రాలేదు . ఈ అంశంలో రాను రాను పాజిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉండటం కమలా హ్యారిస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ దూకుడు అమెరికాకు నష్టం చేస్తుందని .. ఆయనను వ్యతిరేకించేవారు బలమైన స్థాయిలోనే ఉన్నారు. డిబేట్ల తర్వాత కమలా హ్యారీస్ మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ట్రంప్ డిబేట్లపై వెనుకడుగు వేస్తున్నారు. మొత్తంగా పది రోజుల కింట నెక్ట్స్ ట్రంపే అని చెప్పుకున్న వాళ్లు ఇప్పుడు … అంత ఈజీ కాదని అనుకోవాల్సి వస్తోంది.