రామ్, పూరి జగన్నాథ్ ల డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ లో కథని దాదాపుగా రివిల్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ లానే ఇది కూడా బ్రెయిన్ మార్పిడి బ్యాక్ డ్రాప్లో వుండే కథే. సంజయ్ దత్ కి అమరత్వం కావాలి. అలా జరగాలంటే తన బెయిన్ ని మరో బాడీలో పెట్టాలి. అనుకోని పరిస్థితిలో ఆ బ్రెయిన్ మళ్ళీ రామ్ కి పెడతారు. తర్వాత ఏం జరిగిందనేది స్టొరీ లైన్.
పూరి మార్క్ తో ట్రైలర్ అన్ని కమర్షియల్ హంగులతో నిండింది. లవ్ ట్రాక్ వుంది. మదర్ సెంటిమెంట్ కూడా వుంది. పూరి ట్రేడ్మార్క్ మాస్, యాక్షన్ , వన్లైనర్లు బాగానే వున్నాయి. శివలింగం వద్ద జరిగే ఫైట్ కూడా భారీగా తీశారు.
రామ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపించారు. ఈసారి మాస్ మ్యాడ్ నెస్ ఆయన పాత్రలో మరింతగా పెంచాడు పూరి. సంజయ్ దత్ బిగ్ బుల్గా విలనిజం పంచాడు. కావ్య థాపర్ గ్లామరస్ గా వుంది. విజువల్స్ కమర్షియల్ కొలతలకు తగ్గట్టుగా వున్నాయి, మణిశర్మ నేపధ్య సంగీతం మాసీ అండ్ లౌడ్ గా వుంది. మొత్తానికి ట్రైలర్ సినిమా మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని రుజువుచేసింది. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది.