వాల్తేరు వీరయ్య నుంచి `పునకాలు లోడింగ్` పాటొస్తోంది… అది అదరగొట్టేస్తుంది… ఫ్యాన్స్కి పూనకాలు ఖాయం` అంటూ ఈ పాట గురించి చిత్రబృందం ఓ రేంజ్లో స్టేట్మెంట్లు గుప్పించింది. అందులో రవితేజ కూడా కనిపిస్తాడు కాబట్టి జనాలు ఎక్కువగానే ఊహించుకొన్నారు. చిరు, రవితేజ మాస్ స్టెప్పులూ, దేవిశ్రీ బీటూ.. ఎలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇన్ని ఎదురుచూపుల మధ్య ఆ పాట వచ్చింది… కానీ అది పాటెలా అయ్యిందన్నదే ఎప్పుడ ప్రశ్న.
మూడు నిమిషాల సుదీర్ఘ మ్యూజిక్ బిట్ ఇది. `డోన్ట్ స్టాప్ డాన్సింగ్… పూనకాలు లోడింగ్` అనే హుక్ లైన్.. చిన్నపాటి రాప్ తప్ప.. ఇందులో పాటనేదే లేదు. ఇదో మ్యూజిక్ బిట్ అంతే. దాన్ని పాట రేంజ్లో ఊహించుకొనేసరికి… అభిమానులు డీలా పడ్డారు. వినగా…. వినగా.. ఆ ఊపూ, ఉత్సాహం వస్తాయేమో గానీ… వినగానే ఊపొచ్చేసే… పాట (బిట్) అయితే కాదిది. దీన్ని పాటగా రిలీజ్ చేయడం పెద్ద తప్పు. దానికి భారీ బిల్డప్ ఇవ్వడం ఇంకా పెద్ద తప్పు. ఈ బిట్ ఇప్పుడు రిలీజ్ చేయకుండా థియేటర్లోనే చూపిస్తే… జనాలకు కిక్ వచ్చేదేమో. `ధమాకా`లో ఇదే చేశారు. `పల్సరు బైకు` పాట ఉందని అస్సలు చెప్పలేదు. దాన్ని థియేటర్లో రివీల్ చేసే సరికి బాగా పేలింది. ఆ పాట ఊపు తెచ్చింది. పూనకాలకూ అదే స్ట్రాటజీ వాడి ఉంటే బాగుండేది. నిజానికి… వాల్తేరులో చిరు, రవితేజ మధ్య పాట పెట్టే సెట్యువేషన్ లేదు. అందుకే మ్యూజిక్ బిట్ తో సరిపెట్టాల్సివచ్చింది.