నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం చాలా అన్వేషణ జరిగింది. సీనియర్ నటుడు అర్జున్ పేరు కూడా పరిశీలించారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్‌ని తీసుకొచ్చారు. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా ఖాయమైనట్టు మైత్రీ మూవీస్ సంస్థ ప్రకటించింది. దునియా విజయ్ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రమిదే.
అఖండ తరవాత బాలయ్య, క్రాక్ తరవాత.. గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా. ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు మొదలయ్యాయి. సంక్రాంతి తరవాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ కెమెరామెన్‌గా పనిచేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. పక్కా మాస్ సినిమా కాబట్టి, పవర్ఫుల్టైటిల్ కోసం అన్వేషిస్తోంది చిత్రబృందం.