వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇంటి దగ్గర ఆందోళన చేస్తోన్న భార్య వాణి, కుమార్తెతోపాటు ఐదుగురు తనపై హత్యాయత్నం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు విరగ్గొట్టడమే కాకుండా తనపై హత్యాయత్నం చేయబోరని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను కోరారు.
రెండు రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య , పిల్లలు ఆందోళన చేపట్టారు. దివ్వెల మాధురి అనే మహిళాతో దువ్వాడ శ్రీనివాస్ వేరే కాపురం పెట్టి అన్యాయం చేస్తున్నాడని , తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైటాయించారు. ఈ క్రమంలోనే మాధురి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాణిపై సంచలన ఆరోపణలు చేసింది. దువ్వాడ శ్రీనివాస్ తాను రిలేషన్ లో ఉన్నామని, అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటామని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది.
మరోవైపు, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళ విరమించబోమని దువ్వాడ భార్యా, పిల్లలు ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలోనే తనపై హత్యాయత్నం చేశారంటూ భార్యా , పిల్లలపై దువ్వాడ ఫిర్యాదు పోలీసులకు చేశారు. నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నారు. భార్యా, పిల్లల నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. వాణితో తాను విడాకులు తీసుకుంటానని దువ్వాడ స్పష్టం చేశారు.