ప్రస్తుతం నిర్మాతగా మంచి ఫామ్ లోనే వున్నారు దిల్ రాజు. ఆయన రీసెంట్ గా నిర్మించిన శతమానంభవతి, నేను లోకల్ చిత్రాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. మిశ్రమ స్పందన వచ్చినా.. శతమానం భవతి అనూహ్యంగా లాభాలు తెచ్చేసింది. నేను లోకల్ అయితే బిగినింగ్ నుండే మంచి టాక్ తో రూపాయికి రెండు రూపాయిలు తెచ్చింది. ఈ రెండు బడ్జెట్ సినిమాలు కావడంతో మంచి లాభాలనే చూశారు దిల్ రాజు.
అయితే ఓ అనుమవాద సినిమా మాత్రం గట్టిదెబ్బ కొట్టింది. అదే మణిరత్నం చెలియా. మణిరత్నం అమృతతో గట్టి దెబ్బతిన్నారు దిల్ రాజు. ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు చూపించి దారుణమైన ఫలితాన్ని చవి చూశారు. అయితే ఆయనకి మణిరత్నంతో పై వున్నా అభిమానం పోలేదు. చాలా రోజుల తర్వాత ఓకే బంగారం ను మళ్ళీ తెలుగులోకి తెచ్చారు. ఇది మంచి విజయం అందుకుంది. అదే క్రమంలో మణి రీసెంట్ సినిమా చెలియాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా రివర్స్ కొట్టేసింది. చాలా లిమిటెడ్ అడియాన్స్ కే పరిమితమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మెజార్టీ అడియాన్స్ కు అసల్ కనెక్ట్ కాలేదు. ఈ సినిమా దిల్ రాజు కు అమృత ఎఫెక్ట్ ను మిగిల్చింది.
అయితే ఇప్పుడీ డ్యామేజీ ‘డిజే’ రూపంలో కవర్ అయినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాధం విడుదలకు ముందే లాభాలు పంట తెచ్చినట్లు ఇన్ సైడ్ టాక్. బన్నీ మార్కెట్ సినిమా హిట్ అయితే ఈజీగా రూ.60కోట్లు. డిజే ను బడ్జెట్ లెక్కల్లో తీశారు. చాలా ఖచ్చితంగా అనుకున్న బడ్జెట్ కానిచ్చారు. ఇప్పుడు అమ్మకాలు కూడా అనుకున్నట్లే జరిగాయని టాక్. దాదాపు రూ 20కోట్లు టేబుల్ ప్రాఫిట్ కింద వచ్చేసిందని వినిపిస్తుంది. ఈ లెక్కన చెలియా నష్టాలను డిజే కవర్ చేసేసిందన్నమాట.