దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ నాటకాల్లో మరొకటి బయటపడింది. లగ్జరీ కారులో టెక్కలి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో దివ్వెల మాధురీ వేరే కారును ఢీకొట్టింది. ఆమెది లగ్జరీ కారు కావడంతో బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డారు. ఆస్పత్రిలో మీడియాతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఎదుటి కారును ఢీకొట్టాని.. దువ్వాడ వాణి వేధింపుల వల్లే చనిపోవాలనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే ఇదంతా పర్ ఫెక్ట్ స్క్రిప్ట్ అని తాజాగా బయటపడింది. ప్రమాదం జరిగిన వెంటనే కంగారుగా.. దివ్వెల మాధురీ.. దువ్వాడ శ్రీనుకు ఫోన్ చేశారు. అందులో ఎలా యాక్ట్ చేయాలో.. ఏం చెప్పాలో దువ్వాడ శ్రీను మాధురికి వివరించారు. ఆ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. వైరల్ గా మారింది. దువ్వాడ వాణి వల్లే చనిపోయేందుకు ప్రయత్నించానని ప్రచారం చేయాలని సూచించారు. మాధురీ దువ్వాడ చెప్పినట్లే చెప్పారు.
కొద్ది రోజుల నుంచి దువ్వాడ మాధురీ కనిపించడం లేదు. ఏమైనా సెటి్ల్మెంట్ చేసుకున్నారో లేదో కానీ.. దువ్వాడ కూడా కనిపించడం లేదు. ఆయన ఇంచార్జ్ పదవిని తీసేయడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడీ ఆడియో టేప్ టెక్కలి ప్రజల ముందు ఆయన పరువును మరోసారి తీసింది.