మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని ఈసీ పేర్కొంది. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
సిరిసిల్ల ప్రచారంలో కేసీఆర్ చవటలు, దద్దమలు, నిరోధులు అమ్ముకొండి అంటూ వ్యాఖ్యలు చేశారని…. ఇవి ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
ఎన్నికలకు మరో పదిరోజులే గడువున్న సమయంలో ఈసీ రెండ్రోజుల బ్యాన్ పై బీఆరెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.