ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత ఏడాది కాలంలో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్లలోని డేటాను రికవరీ చేసింది.. ఆమె తరఫున హాజరైన న్యాయవాది సోమా భరత్ సమక్షంలో ఫోన్లను ఓపెన్ చేసిన అధికారులు అందులో ఉన్న డేటాతో పాటు డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేశారు. పాస్ వర్డ్స్ ను సోమా భరత్ చెప్పలేకపోతే… ఫోరెన్సిక్ నిపుణుల నుంచి ఈడీ ఆఫీసర్లు సాయం తీసుకున్నారు. డేటా రికవరీ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఆమె సమర్పించిన పది ఫోన్లలో మెమొరీ సైజుకు అనుగుణంగా రికవరీ ప్రక్రియకు సమయం పడుతుందని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి.
కవిత సమర్పించిన అన్ని ఫోన్లలోని డేటాను రికవరీ చేసినందున దాన్ని విశ్లేషించి మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసే ్వకాశం ఉంది. డేటాలో లిక్కర్ స్కామ్లో నిందితులు లేదా అనుమానితులుగా ఉన్నవారితో కవిత జరిపిన సంప్రదింపులు, డాక్యుమెంట్ల షేరింగ్, వాట్సాప్ ద్వారా జరిగిన సంభాషణలు, చాటింగ్ వివరాలు, హోటళ్లలో జరిగిన మీటింగుల్లో పాల్గొనడం తదితరాలపై సమాచారం లభ్యమైతే కవితకు చిక్కులు తప్పవని భావిస్తున్నారు.
ఇప్పటివరకు నిందితులు, అనుమానితులు, సాక్షుల నుంచి పలు వివరాలు ఈడీ.. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో మార్పులు చేర్పులపై వ్యాపారులు, సౌత్ గ్రూపునకు చెందిన సభ్యులతో జరిగిన సంప్రదింపులే కీలకమని ఈడీ భావిస్తోంది. కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కొన్ని డాక్యుమెంట్లను ఈడీకి సమర్పించారు. లిక్కర్ వ్యాపారంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని లావాదేవీలు తన పేరుపై జరిగినా అవి తన క్లయింట్లవని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.