ఇండియన్ పోలీస్ సర్వస్ IPS.. ఈ పేరుకు ఉన్నంత పవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IASకు కూడా ఉండదేమో. ఆ యూనిఫాంలోనే ఓ పవర్ ఉంటుంది. అందుకే దేశంలో ఎన్నో హీరోచిత గాధలు ఈ ఐపీఎస్ ఆఫీసర్లవే ఉంటాయి. దేశ రక్షణ బాధ్యతల దగ్గర నుంచి జిల్లాల ఎస్పీల వరకూ ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధపడే నైజం ఈ ఆఫీసర్లకు ఉంటుంది. అలాంటి స్పిరిట్‌తోనే డిపార్టుమెంట్లో చేరుతారు కూడా. కానీ ఏ వ్యవస్థకైనా వంద శాతం స్వచ్చత ఉండదు..ఎక్కడో చోట చెదలు పడుతుంది. వైరస్ అంటుకుంటుంది. దాన్ని వ్యవస్థే గుర్తించి.. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే మరింత పవర్ ఫుల్‌గా మారుతుంది . లేకపోతే మరింత బలహీనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ కూడా బలపడాలా.. బలహీనపడాలా అన్న క్రాస్ రోడ్స్ లోనే ఉంది. ఖాకీ అధికారం మాటున ఐదేళ్ల పాటు చేసిన అరాచక, మాఫియా రాజ్యంలో బాధితులు అందరూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. వారు చేసిన నేరాలు, ఘోరాలు చూసి సామాన్య జనం ఉలిక్కి పడుతున్నారు. ఇప్పుడు వారందరికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తే తప్ప.. మరొకరు అలాంటి తప్పులు చేసేందుకు భయపడు. వారు ఏ మాత్రం.. వ్యవస్థలోని లూప్ హోల్స్ ను అడ్డం పెట్టుకుని బయటపడినా.. మొత్తం వ్యవస్థలో ఈ జాడ్యం పెరిగిపోతుంది. అది సమాజం వినాశనానికి లా అండ్ ఆర్డర్ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఇప్పుడు ఏపీ వైపు అందరి చూపు పడింది.
కోల్‌కతా హత్యాచార ఘటన కన్నా ఘోరమే !
కాదంబరి జెత్వానీ అనే చిన్న నటి ఏపీ పోలీసుల అరాచకత్వానికి బలైపోయిన విషయం మన కళ్ల ముందు ఉంది. ఆమెపై తప్పుడు కేసు పెట్టించడమే కాదు.. కిడ్నాప్ చేసినట్లుగా తీసుకు వచ్చి కుటుంబాన్ని నలభై రోజుల పాటు బంధించారు. తమకు కావాల్సిన విధంగా సంతకాల పెట్టించుకుని.. ఎక్కడైనా నిజాలు మాట్లాడితే చంపేస్తామని భయపెట్టి .. నమ్మకం కుదిరిన తర్వాతనే వదిలేశారు. అప్పటి నుంచి ఆ కుుటుంబం నలిగిపోతోంది. ఆ నటి చేసిన తప్పేంటి ?. ఓ పారిశ్రామిక వేత్త తనతో అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టడం.. మరో తెలుగు పారిశ్రామిక వేత్త చేతిలో మోసపోవడం. ఇవి ఆమె తప్పులు. ఈ కేసులో అసలేం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదు. అసలు నిజం కొత్తగా దర్యాప్తు అధికారిగా నియమితులైన విజయవాడ ఏసీపీ స్రవంతి రాయ్ దర్యాప్తులో తేలుతుంది. కానీ బయటకు వచ్చిన వివరాల ప్రకారం.. పోలీసులు మాఫియాను మించి వ్యవహరించారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఓ మహిళా నటిని.. ఆ కుటుంబాన్ని బెదిరించడానికి చేయని తప్పులే లేవు. రూ. ఐదు లక్షల చీటింగ్ కేసు పిర్యాదు వస్తే.. ప్రత్యేక విమానాల్లో వెళ్లి కుటుంబం మొత్తాన్ని తీసుకు వస్తారా ?. మార్గదర్సి ఇష్యూలో ఓ చిట్ డిఫాల్టర్ ఆ సంస్థపై ఫిర్యాదు చేయించడానిక నేరుగా అతనితో కలిసి ప్రెస్ మీట్ పెట్టేసిన అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా .. కనీసం ఇలా ఓ నటి కుటుంబంపై కేసు పెట్టామని.. అరెస్టు చేసి తీసుకు వచ్చామన్న సంగతిని కూడా మీడియాకు తెలియనివ్వలేదంటే వారి కుట్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోల్ కతా మహిళా డాక్టర్ ను అత్యాచారం చేసి చంపేశారు.. కానీ మర్డర్ మాత్రమే చేయలేదు.. అన్ని అఘాయిత్యాలూ చేసేశారని ఆమె కన్నీరుమన్నీరవుతున్నారు. ఇది పోలీసు వ్యవస్థకే మచ్చ.
ఐదేళ్లలో చట్టం పేరుతో చేయని అరాచకం లేదు !
ఇదొక్కటే ఇలా చేశారని అనుకోవడానికి లేదు. ఐదేళ్ల కాలంలో కొంత మంది ఐపీఎస్ అధికారులు ఓ ముఠాగా ఏర్పడిపోయి మాఫియాగా మారిపోయారు. ఓ ఐపీఎస్ సిట్ చీఫ్.. మరో ఐపీఎస్ సీఐడీ చీఫ్.. మరో ఐపీఎస్ డీజీపీ.. మరికొందరు ఐపీఎస్‌లు ఎస్పీలుగా ఉంటూ.. అరాచక రాజ్యాన్ని నెలకొల్పారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కాకపోయినా అయిందని ఆరోపించి.. ప్రస్తుత మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత ఫోన్ ట్యాప్ చేసి.. ఆయన కుమారుడి వర్థంతి కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఐకియా ముందు కిడ్నాప్ చేసినట్లుగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లేదాకా ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. వైసీపీ హయాంలో అరెస్టులు జరిగిపోతాయి.. ఏ కేసులో అన్నది వారిని కోర్టులో హాజరు పరిచే వరకూ తెలియదు. చివరికి పధ్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబును కూడా అదే విధంగా అరెస్టు చేశారు. ఆయన తప్పు ఉంటే.. నోటీసులు జారీ చేయాలి.. విచారణ చేయాలి.. అప్పుడు అరెస్టు చేయాలి. కానీ ఆయనను అరెస్టు చేసిన ఇరవై గంటల తర్వాత ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కథలు చెప్పారు. సామాన్యుడు ఎవరికైనా ఈ పోలీసుల తీరు చూసి భయం వేసి ఉంటుంది.. బాధ వేసి ఉంటుంది. ఇంతటి అరాచక రాజ్యంలోనా బతుకుతోంది అని వణికిపోయి ఉంటాడు. ఇదే చంద్రబాబుపై ఎన్ని సార్లు హత్యాయత్నాలు జరిగాయో లెక్క లేదు. పోలీసుల కనుసన్నల్లోనే రాళ్ల దాడి జరిగింది. మార్కాపురంలో చంద్రబాబుకు తగలాల్సిన ఓ రాయి.. ఓ వృద్దుడికి తగిలింది. ఆయన కొద్ది రోజులు ఆస్పత్రిలో చావుబతుకుల్లో పోరాడి చనిపోయాడు. దీన్నేమంటారు ? పుంగనూరులో.. కృష్ణా జిల్లాలో ఇదే తరహా రాళ్ల దాడులు జరిగాయి. చివరికి కుప్పంలోనూ అంతే. ఇంటలిజెన్స్ చీఫ్ పకడ్బందీగా చేయించిన రాళ్ల దాడులని అందరికీ తెలుసు. ఓ ప్రతిపక్ష నేతను చంపడానికి ఇలా వ్యవస్థీకృతంగా కుట్ర జరిగిందని అధికారవర్గాల్లో ఉన్న వారందరికీ తెలుసు. ఇలాంటి పనులు ఐపీఎస్‌లు చేయడమే.. అసలు విషాదం. చంద్రబాబున కేసుల్లో ఇరికించడానికి తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పించడానికి కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారి వేసిన వేషాలు.. ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాయి. సిమెన్స్ ఇండియా చీఫ్ గా ఉన్న సుమన్ బోస్ అనే వ్యక్తిని ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకు వచ్చి.. జైల్లో ఓ శవం పక్కన ఆయనను కూర్చోపెట్టి.. తమకు కావాల్సిన స్టేట్మెంట్ ఇవ్వాలని రాయించుకున్నారంటే.. వారు ఐపీఎస్లా.. రాక్షసులా అన్నది అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు.
ఇంకెన్ని ఘోరాలు బయటపడాల్సి ఉందో !
రాజకీయ వేధింపుల స్థాయి దాటి ఇలా ప్రైవేటు సెటిల్మెంట్ల వరకూ వెళ్లిపోయారన్నది తాజాగా బయటపడిన నిజం. ఇప్పుడు బాధితురాలు బయటకు వచ్చారు కాబట్టి అసలు సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఐదేళ్ల కాలంలో జరిగిన అనేకానేక మాఫియా పనుల్లో ఇది ఒకటి మాత్రమే. ఇంకా ఎన్ని ఉన్నాయో.. తుపాకులు గురి పెట్టి ఎంత మంది ఆస్తులు రాయించుకున్నారో.. ఎంత మంది మహిళలను వేధించారో ముందు ముందు బయటకు రావాల్సి ఉంది. ఒకసారి చేసిన తప్పు కాదు.. నిరంతరాయంగా వారు అదే పనులకు అలవాటు పడ్డారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణం అంటే.. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టే తెగింపు.. అరెస్టుల్ని అడ్డుకునే దిగజారుడు తనం ఉన్న ఐపీఎస్‌లు ఉన్నారు. అప్పుడు పవర్ లో ఉన్న పనులు చేసి..ఆ అడ్వాంటేజ్‌తో తాము చేయగలిగినన్ని తప్పుడు పనులు చేశారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. పదహారు మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు లేవు. ఇప్పటికీ వారు తీరు మార్చకోలేదని.. డీజీపీ ఇచ్చిన మెమోను ఉల్లంఘిస్తున్న తీరే అర్థమవుతుంది. వారు ఐపీఎస్ వ్యవస్థకు పట్టిన వైరస్ వంటి వారు.
ఐపీఎస్ వ్యవస్థకే వైరస్ వీళ్లు – తీసిపడేయాల్సిందే !</spa
వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ముందు వైరస్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. అందు కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్‌ను ఎక్కడికక్కడ నిర్మూలించాలి. ఐపీఎస్ అంటే ఎంత వపర్ ఫుల్లో వారు ఎలా ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలరో.. వారు దారి తప్పితే దేశానికి ఎంత ప్రమాదమో.. ముస్సోరిలో చెబుతారు. అవన్నీ ట్ైనింగ్ లో నేర్చుకుని వచ్చిన వారు ఇక్కడ రాజకీయ నేతల ప్రాపకం కోసం.. ఘోరాలకు పాల్పడుతున్నారు. వీరు నిజంగా సివిల్స్ పాసయ్యారా అనే డౌట్ వచ్చేలా వీరి ప్రవర్తన ఉంటుంది. ఒకరు మత పరమైన వ్యాఖ్యలు చేస్తారు.. మత సంస్థను నడుపుతారు.. ఇంకొకరు.. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని వ్యాఖ్యానిస్తారు. మరొకరు ఇలా కిడ్నాపులకు పాల్పడి.. సెటిల్మెంట్లు చేస్తారు. మరొకరు..అందరి ఫోన్లను ట్యాప్ చేసి.. వ్యక్తిగత వివరాలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. ఇలాంటి నీచ్ కమీన్ తెలివితేటలో ఉన్న వారు ఐపీఎస్ పోస్టులకే అనర్హులు. క్రిమినల్ పాలకులకు ఎం కావాలో అది చేసి పెట్టి ఆ చనువుతో … తమ ఘనకార్యాలు తాము చేసుకోవచ్చన్నట్లుగా మారిపోయిన వ్యవస్థను .. గాడిలో పెట్టాలంటే.. ఆ పదహారు మంది ఐపీఎస్‌లపై ఊహించని శిక్షలు విధించాల్సిందే. రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి.. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ..కానీ అధికారులు మాత్రం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటూ ఉండాలి. తోటి ఆఫీసర్లపై కుట్రలు చేయడం.. కీలక పోస్టింగుల కోసం.. తప్పుడు పనులు చేయడం.. ఐపీఎస్‌ల లక్షణం కాదు. అలాంటి లక్షణాలు ఉన్నవారు ఐపీఎస్‌లే కాదు.
మరొకరు అలాంటి తప్పులు చేయకుండా శిక్షించాల్సిందే !
ప్రస్తుతం ఏపీలో ఐపీఎస్‌ల తీరు బయటపడింది. వీరికి విధించే శిక్ష ఎలా ఉండాలంటే.. దేశవ్యాప్తంగా మరొక ఐపీఎస్.. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేయాలంటే.. వీరే గుర్తుకు వచ్చేలా శిక్షించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే.. పోలీసు వ్యవస్థకు పట్టిన వైరస్ వదులుతుంది. వీరు ఏ మాత్రం వ్యవస్థలోని లొసుగుల్ని ఆసరా చేసుకుని మళ్లీ విధుల్లోకి వచ్చినా.. అది మరింత ప్రమాకరం. ఎందుకంటే ఏం చేసినా ఏమ కాదన్న ధైర్యంతో .. ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. అరాచకం సృష్టిస్తారు. అది అచ్చమైన దేశద్రోహంగా మారిపోతుంది. అందుకే.. .ఈ ఐపీఎస్‌లకు క్యాపిటల్ పనిష్మెంట్ ద్వారా.. పోలీసుల్ని మరోసారి గ్రేట్‌గా మార్చాలి. మేక్ ఏపీ పోలీస్ గ్రేట్ ఎగైన్.