జగన్ రెడ్డి బహిరంగసభలో ఈనాడు పేపర్ ను చూపించి అందులో ఏమున్నదో చదివి వినిపించారు. వెటకారం చేద్దామనో…. అందులో తప్పు రాశారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు కానీ.. ఆయన మాటలు విని.. ఈనాడును చూడని వైసీపీ వాళ్లకు స్వయంగా ఆయనే ఈనాడులో ఏమొస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈనాడుకు ఇంత కన్నా కావాల్సింది ఏముంది ?. జగన్ రెడ్డి అలా స్టేజ్ మీద ఈనాడును చూపించడం వల్ల సాక్షి మాత్రమే చదవుతూ.. అదో లోకంలో ఉండిపోతున్నామని అనుకునే జగన్ రెడ్డి ఫ్యాన్స్ ఇక నుంచి ఈనాడు, జ్యోతిలు కూడా చదివే అవకాశం ఉంది. నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు ప్లస్ అవుతుంది.
ఈనాడు గురించి ఈ రోజు జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆయన నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈనాడుపై ఎవరి అభిప్రాయం వారికి ఉంది. ఈనాడు చదవొద్దని.. జగన్ రెడ్డి ఎన్నో సార్లు పిలుపునిచ్చారు. కానీ ఆయనే చదువుతూ.. ఇందులో ఇలా వచ్చిందని.. ప్రజలకు చూపిస్తున్నారు. అంతేనా… మీకు తెలియని విషయాలు తెలియాలంటే.. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టీవీ 5 కూడా చూడాలన్నట్లుగా పిలుపునిస్తూ ఉంటారు.
కొత్తగా ఆయన ఆరు గ్యారంటీలకూ ప్రచారం చేస్తున్నారు. చింతపల్లి సభలో ఆరు గ్యారంటీల గురించి పక్కన వాళ్లను అడిగి మరీ తెలుసుని ప్రచారం చేశారు. తాము ఇస్తున్న దాని కన్నా మూడింతలు సంక్షేమం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవ్వలేరని మోసం చేస్తారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చుకానీ.. ఏమీ చేయకుండా అప్పులు తెచ్చి బటన్ నొక్కేవాడే ఇస్తే… ఇక సంపద సృష్టించి ఇచ్చేవాళ్లు ఎందుకు ఇవ్వరని.. సందేహం ఎదురుగా కూర్చున్న వాళ్లకు వస్తుంది.
మొత్తంగా జగన్ రెడ్డి కూడా.. తమకు ప్రచారం.. నెగెటివ్ వేలో అయినా సరే తమ పథకాలను వైసీపీ క్యాడర్..సానుభూతి పరుల్లోకి తీసుకెళ్లడం వారికి హ్యాపీగా అనిపిస్తోంది.