రెండున్నర నెలలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి నేటితో ఎండ్ కార్డు పడింది. మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి రాగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించింది ఎన్నికల కమిషన్.
ఏప్రిల్ 19న తొలి దశలో102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగగా… ఆఖరి విడత జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి దశ పోలింగ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గురువారమే ప్రచార పర్వానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు జూన్ 1 న ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన మూడు రోజుల్లో అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానుండటంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు ఇప్పుడు రిలాక్స్ కానున్నారు.
ఈ ఎన్నికలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతల మధ్య మునుపెన్నడూ లేని విధంగా డైలాగ్ వార్ నడించింది. బీజేపీ వికసిత్ భారత్ అనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లగా… మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకు పెను ప్రమాదని కాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో జాతీయ స్థాయిలో విజయం మాదేంటే మాదేనని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ విజయం ఎవరిదో తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు… దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తి రేపుతుంటే ఏపీలో ఎవరిది అధికారం అన్నది మరో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి నెలకొనడం విశేషం.