కౌంటింగ్ డే రోజుకు ఏపీ ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలు, అల్లర్లను దృష్టిలో పెట్టుకొని… అధికారులు కౌంటింగ్ డే కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఫలితాల రోజున ఎలాంటి విధ్వంసం జరగకుండా ఫుల్ ఫోకస్ చేశారు.
ఇప్పటికే పల్నాడును సీరియస్ గా తీసుకోగా… అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఇప్పుడు కడపలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా 21 మంది రౌడీ షీటర్లను జిల్లా నుండి బహిష్కరించారు. జూన్ 7వ తేదీ వరకు కడప జిల్లా లిమిట్స్ లోకి వారికి అనుమతి లేదు. వీరికి తోడు చాలా మందిని గృహ నిర్బంధంలో ఉంచారు.
స్థానిక పోలీసులు ఇప్పటికే కేంద్ర బలగాలను రప్పిస్తుండగా…. గతంలో ఎన్నికల గొడవలు జరిగిన ప్రాంతాలు, గొడవల్లో ఉన్న వారు ఎవరు… వారు ఇప్పుడు ఎక్కుడున్నారు… అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గొడవలు జరగవద్దన్న ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు సమాయత్తం అవుతున్నారు.
పులివెందుల, కడప, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ గా ఉండటంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు పోలీసులు.