కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు విజయవాడలో నిర్వహించిన సమావేశాల్లో ఏపీ విషయంలో తమకు పూర్తిగా సమాచారం ఉందని అధికారులకు తెలిసేలా చేశారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో ఓ అధికారి ముఫ్పై వేల దొంగ ఓట్లు వేయడానికి.. దొంగ ఓటర్ కార్డులు తయారు చేయడానికి తన ఎన్నికల సంఘం లాగిన్ వివరాలు ఓ ఎమ్మెల్యే కొడుక్కు ఇచ్చినట్లుగా కూడా తేలింది. ఇలాంటివి తెలిసినప్పుడు గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదో కానీ ఇప్పుడు మాత్రం తమకు అంతా సమాచారం ఉందని అధికారులను గట్టిగానే హెచ్చరించారు.
ఈసీ అధికారులు గట్టిగా వ్యవహరిచిన విధానం చూస్తే.. ఎన్నికల షెడ్యూల్ రాగానే ఏపీలో బదిలీల జాతర ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ రాగానే ప్రభుత్వతో అంట కాగిన వారందర్నీ ఎన్నికలతో సంబంధం లేని పోస్టులకు బదిలీ చేయడమో.. లేకపోతే బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా చేయడమో చేస్తారు. అలాంటి వారి జాబితా ఏపీలో చాలా ఎక్కువగా ఉందని ఈసీ ఫుల్ బెంచ్ తీవ్రంగా హెచ్చరించింది కాబట్టి అలాంటి వారందరికీ స్థాన చలనం ఉంటుంది.
ఓటర్ జాబితా విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు.. ఇక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలకు స్పష్టత లేదు. తలాతోక లేని ఓకేసు పెట్టి… సాక్షాత్తూ రాష్ట్ర సీఈవోను బెదిరిస్తున్న వైనం కూడా.. ఈసీకి తెలియకుండా ఉండదు. తమ వ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేస్తూంటే… భయపడిపోతుందా.. లేకపోతే.. పవర్ ఏమిటో చూపిస్తారా అన్నది ముందు ముందు ఈసీ తీసుకునే చర్యలను బట్టి ఉంటుదంన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా ఏపీలో రెండు రోజుల పాటు ఈసీ పర్యటన.. నమ్మకమైన , నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా ఉంది.కానీ చేతల్లో అది కనిపిస్తుందా లేదా అన్నదే ప్రజల సందేహం. ఎందుకంటే… ఈ ఐదేళ్లలో ప్రజలు ఇలాంటి హెచ్చరికలు చాలా చూశారు కానీ… టూరిస్ట్ బస్సుల్లో వచ్చి ఓట్లేసే ఆగడాలు మాత్రం ఆగలేదు మరి !