డా.రాజశేఖర్. ఈయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 3న విడుల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమంలో… జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ – “నిర్మాత కోటేశ్వర్ రాజుగారు మాకు మా మావయ్యగారి ద్వారా పరిచయం. రాజశేఖర్‌గారికి మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్లోనూ చేయవచ్చు. ఎక్కువ బడ్జెట్లోనూ చేయవచ్చు. సీన్స్‌ను కొన్ని హైదరాబాద్‌లో తీయ్యవచ్చు, కొన్ని బ్యాంకాక్‌లో తీయవచ్చు, ముంభైలో అయినా చేయవచ్చు. ప్రతిసారి నిర్మాతగారు పెద్దగానే ఆలోచించి సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు. మా అమ్మాయి పేరు మీదనే జ్యో స్టార్ బేనర్‌ను స్టార్ట్ చేశాం. సినిమాను దాదాపు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. నవంబర్ 3న సినిమా విడుదలవుతుంది. కానీ కొందరు సినిమా ఫైనాన్సియల్ సమస్యలున్నాయని, అందువల్ల సినిమా నవంబర్ 3న రాదని అంటున్నారు. కానీ అలాంటిదేం లేదు. సినిమా చెప్పిన తేది నవంబర్ 3నే విడుదలవుతుంది“ అన్నారు.
నిర్మాత కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ – “సినిమాను చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించాం. చాలా ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. సినిమా నవంబర్ 3న విడుదల కావడం ఖాయం. జీవితగారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రవీణ్‌సత్తారు గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది“ అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ – “నేను సాధారణంగా ఎమోషన్ కాను. కానీ సినిమా గురించి ప్రస్తావించిన ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను. ప్రవీణ్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సినిమాకు నలుగురు పిల్లర్స్ ఉన్నారు. అందులో ఒకరు నిర్మాతగారు, ఒకరు జీవిత, మూడోవ్యక్తి ప్రవీణ్ సత్తారుగారు, నాలుగో వ్యక్తి మా నాన్నగారు. వీరు కాకుండా నా పిల్లలు శివాని, శివాత్మికలు సూపర్ పవర్స్‌లా మరో రెండు పిల్లర్స్‌లా ఈ సినిమాకు సహకారం అందించారు. ఈ సినిమా టీజర్‌ను మా అమ్మగారు చూశారు. ఆవిడ చాలా హ్యాపీగా పీలయ్యాను. ఆవిడ చనిపోతుందని నేను అనుకోలేదు. ఆవిడ చనిపోవడంతో నేను క్రింద పడిపోయినట్లు అనిపించింది. మేం సినిమాల్లో ఉండటం కారణంగా చాలా వరకు ఆస్థులను అమ్మేశాను. దాంతో నష్టపోయాను. ఆ విషయంలో మా అమ్మగారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఈ సినిమా సక్సెస్‌తో నేను బాగానే ఉన్నానని మా అమ్మకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేక్షకుల సహకారం ఉండాలని కోరకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ – “సిినిమా చాలా బాగా వచ్చింది. నవంబర్ 3న విడుదలవుతుంది. అలాగే మా డైరెక్షన్ టీం . మా దర్శకుల శాఖ చాలా కష్టపడ్డారు. ఆర్ట్ డైరక్టర్ కూడా చాలా కష్టపడ్డారు. మా ఎడిటర్ కూడా నా తొలి సినిమా నుంచి ఆయనే చేస్తున్నారు. సీవీ రావు గారు నా తొలి సినిమా నుంచి నాతో ఉన్నారు. ఆయన వీఎఫ్ఎక్స్ చేశారు. డీఐ కూడా చేశారు. దీనికి ఓ మూలస్థంభం ఉంది. ఆ స్థంభం జీవితగారు. ఆవిడ అందించిన సహకారం మరచిపోలేను. నిర్మాతగారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి సినిమా కావాలని కోరుకున్నారు. కమ్‌బ్యాక్ ఆఫ్ రాజశేఖర్‌గారు అని నమ్మారు“ అని తెలిపారు.
సన్నిలియోన్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో డియో డియో సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సౌత్‌లో చేసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కరెంట్ తీగ తర్వాత ఈ సినిమాను తెలుగులో చేయడం ఆనందంగా ఉంది. రాజశేఖర్‌గారు సహా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఈ కార్యక్రమంలో పూజా కుమార్, ఆదిత్ అరుణ్ సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.